పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఉదయం టమాటా లోడ్‌తో మార్కెట్‌కు వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం, ఓ రైతు తన పొలంలో పండిన టమాటాలను ట్రాక్టర్‌లో లోడ్ చేసుకుని మార్కెట్‌కు తరలిస్తుండగా, మినీ బైపాస్‌లోని ఫంక్షన్ హాల్ మలుపు వద్ద అధిక లోడ్ కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ట్రాక్టర్‌లో ఉన్న టమాటా పెట్టెలన్నీ రోడ్డుపై పడిపోవడంతో పంట పూర్తిగా నేలపాలైంది. ఇప్పటికే టమాటాకు మార్కెట్‌లో ఆశించిన ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతుకు ఈ ప్రమాదం మరింత ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
Tags; Tomato-laden tractor overturns on mini-bypass; farmer’s hard work goes to waste.