పుంగనూరుముచ్చట్లు:
మోసం చేసిన వారిపై మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించి బైకులో చిత్తూరుకు విధులకు వెళుతుండగారోడ్డు ప్రమాదం.
రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి చెందాడ లేక ప్రత్యర్థులు పథకం ప్రకారం ఏమైనా చంపేశారా అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
పుంగనూరులో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని ఢీకొని ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర దుర్మరణం చెందాడు. మదనపల్లె రామిరెడ్డిగారిపల్లె శివారులో 2023లో ఇంటి స్థలం కొన్న దేవేంద్రకు తరిగొండ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్ లు మోసం చేయడంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాడు. చిత్తూరు ఎంపీడియల్ డిస్టలారీలో విధులకు వెళుతుండగా టోల్ గేట్ వద్ద గుర్తు తెలియని వాహణం ఢీకొని మృతి చెందాడు. మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags: Excise Constable Devendra dies in road accident.