రాయచోటి ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం జి.ఒ నెం.396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవాకేంద్రాలను ఏర్పాటుచేసి, వేల సంఖ్యలో వున్న దస్తావేజు లేఖరులు, వారిపై ఆధారపడి వున్న లక్షలాది కుటుంబసభ్యులు, సహాయకులు, వారి కుటుంబసభ్యుల యొక్క పొట్టకొట్టుటకు చేయుచున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, డి.టి.పి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు ఈనెల 20 నుంచి 31వ తేది వరకు పెన్ డౌన్ చేపడుతున్నామని రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కు వినతిపత్రం సమర్పించారు. ఇందుకు కార్యాలయం అధికారులు ఎటువంటి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన దస్తావేజులను రిజిష్టర్ కోసం స్వీకరించకుండా సహకరించాలని కోరారు.
Tags: Document writers to go on a pen-down strike from July 20.