July 13, 2026
Explore
బైకును తప్పించబోయి ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

బైకును తప్పించబోయి ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

July 13, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు మండలం బోడంపల్లి సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దేవపట్ల నుంచి పీలేరుకు వస్తున్న ఆటో, ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేష్‌తో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Tags: Auto-rickshaw overturns while trying to avoid a bike; six injured.