కలకడ ముచ్చట్లు:
కలకడ–రాయచోటి రహదారిలో బాటావారిపల్లి జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్–ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కూలీలు యశోద, రామానంద, హారతికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన ట్రాక్టర్, ట్రాలీని కలకడ పోలీసులు జేసీబీ సాయంతో తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Tags:Brick-laden tractor overturns; three laborers injured.