హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత (48) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. జులై 12న ఆమె తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు లేదా ఆరోగ్య సమస్యల కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags: ACP’s wife’s suspicious suicide!