— అమరావతి సిఎంవో కార్యాలయం నుంచి ఆరా…
మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె చిత్తూరు బస్టాండు సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన విషయమై పలువురు వాల్మీకి సంఘాల నాయకులు, స్థానికులు గ్రీన్ ట్రిబ్యునల్, సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు లను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు కార్యాలయం నుంచి శుక్రవారం పలువురికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మేకల విజయ్ మోహన్ తెలిపారు. విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాలు ఏమిటి,, విగ్రహం ఏర్పాటు చేస్తే జరిగే నష్టాలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. వారు అడిగిన మేరకు బాహుదా కాలువలో విగ్రహం ఏర్పాటు వలన జరిగే నష్టాలు వివరించడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యంగా బాహుదా కాలువలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు వలన వరదలు సంభవిస్తే భారీ నష్టం జరుగుతుందని, 1996 లో సంభవించిన వరదలు మదనపల్లెకు తీరని నష్టాన్ని కలిగించాయాని, విగ్రహం అక్కడ కాకుండా మరోచోటకు తరలింపు చేయాలని తము కోరడం జరిగిందని సిఎంవో కార్యాలయం సిబ్బందికి తెలియజేసినట్లు మీడియాకు తెలిపారు. తమ ప్రదాన డిమాండ్ బాహుదా కాలువ నుండి విగ్రహం తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలని వెల్లడించారు.
Tags: Leaders of Valmiki associations approach the Green Tribunal regarding the installation of the Chhatrapati Shivaji statue.