మదనపల్లె మదనపల్లె
మదనపల్లెలో కొందరు రేషన్ డీలర్లు ప్రతి నెల 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించారు.
‘డయల్ యువర్ మదనపల్లె ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఈ విషయాన్ని ప్రస్తావించగా, వెంటనే జిల్లా పౌర సరఫరాల అధికారిని (డీటీ) ఎమ్మెల్యే ఫోన్‌లో సంప్రదించారు. 15వ తేదీ వరకు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వని డీలర్ల జాబితాను సిద్ధం చేసి తనకు పంపించాలని ఆదేశించారు.
నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే వారిని తొలగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అధికారులు పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.
Tags; Action against ration dealers failing to supply rice: MLA