July 13, 2026
Explore
సీతారామాలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

సీతారామాలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

July 13, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం నడిమిరాజు గారిపల్లిలో రూ.20 లక్షల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించనున్న సీతారాముల స్వామి ఆలయానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామాల అభివృద్ధికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ ఆలయం గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు.

Tags; Minister lays foundation stone for the construction of the Sita Rama temple.