తంబళ్లపల్లె ముచ్చట్లు:
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి వర్గీయులను తొలుత సమావేశ మందిరంలోకి అనుమతించక పోవడంతో వారు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం జయచంద్రారెడ్డి వర్గీయులను సమావేశంలోకి అనుమతించారు.
ఇదిలా ఉండగా, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా శంకర్ యాదవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనను అనవసరంగా వివాదాల్లోకి లాగారని, నియోజకవర్గంలో తనకు బలమైన వర్గం ఉందని పేర్కొంటూ మరోసారి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు తనకే అప్పగించాలని జయచంద్రారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో తంబళ్లపల్లె టీడీపీలో ఇన్‌ఛార్జ్ పదవిపై పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
Tags; Race for Thamballapalle TDP in-charge: Uproar at Tirupati meeting.