తాడేపల్లి ముచ్చట్లు:
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ
ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా కలవనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు (14.07.2026) విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు శ్రీ వైయస్ జగన్ విశాఖకు వెళ్లనున్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.
అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.
పర్యటన షెడ్యూల్
ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు.
విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు.
అనంతరం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కలుస్తారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించిన శ్రీ వైయస్ జగన్, ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు
రాజులపాటి కళ్యాణి – శివప్రసాద్ దంపతులు
Tags: YS Jagan to visit Visakhapatnam tomorrow.