వినుకొండ ముచ్చట్లు:
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెం గ్రామంలో గత మూడు నెలలుగా అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ నాయకులు మరియు CSDT మండల అధికారి పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళనకరం.
“ప్రజలకు రావాల్సిన రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు?” అని ప్రశ్నిస్తే, ” మీకు దిక్కున చోట చెప్పుకో” అంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రేషన్ బియ్యం అక్రమంగా మళ్లించబడుతోందనే ఆరోపణలపై ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలి.
Tags: Is the ration mafia operating unchecked in Vinukonda?