July 13, 2026
Explore
రావులపాలెం కొత్తకాలనీలో యువకుడి దారుణ హత్య

రావులపాలెం కొత్తకాలనీలో యువకుడి దారుణ హత్య

July 13, 2026 | Andhra Pradesh

అంబేద్కర్ కోనసీమ ముచ్చట్లు:

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో ఆదివారం అర్థరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. అను సాయి అలియాస్ నల్ల సాయి (23) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు సమాచారం.

స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.

ఈ దారుణ ఘటనతో కొత్తకాలనీ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు గల పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Tags: Brutal murder of a young man in Ravulapalem Kotha Colony.