రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలం గాలంగుండ్లపల్లి గ్రామానికి చెందిన పది కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వారు పచ్చ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అభిమానం, విశ్వాసమే తెలుగుదేశం పార్టీకి నిజమైన బలమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని, ప్రజాసేవే లక్ష్యంగా కలిసి పనిచేస్తూ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags: Ten families joined the TDP.