రామాపురం ముచ్చట్లు:
పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.డీఎస్సీ-2003 టీచర్స్ ఫోరం డివిజన్ కన్వీనర్ పలుచూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి “థాంక్యూ సీఎం సర్” అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.కార్యక్రమంలో డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Tags: Government committed to teachers’ welfare: Minister