July 13, 2026
Explore
కొడవలితో దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

కొడవలితో దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

July 13, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు:

సుండుపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన దాడి ఘటనలో వీరబల్లి గ్రామానికి చెందిన చింతమాని నాగరాజ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం, సాతుపల్లికి చెందిన ప్రస్తుతం సుండుపల్లిలో నివాసముంటున్న గౌనుపల్లి ఆదినారాయణ కొడవలితో దాడి చేయడంతో నాగరాజ్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

నాగరాజ్ నాగారపమ్మ గుడి వద్ద జరిగిన విందుకు హాజరై, మరో వ్యక్తితో కలిసి సాతుపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన నాగరాజ్‌ను వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి నుంచి అందిన మెడికో-లీగల్ సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. ఘటన గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags: Sickle attack… youth sustains severe injuries.