July 13, 2026
Explore
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు ఎస్‌ఐ మహేష్ హెచ్చరిక

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు ఎస్‌ఐ మహేష్ హెచ్చరిక

July 13, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు:

సుండుపల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు, వివాదాస్పద సందేశాలు ప్రచారం చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్‌లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మహేష్ హెచ్చరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి గ్రూపులపై పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు. సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మహేష్ స్పష్టం చేశారు.

Tags: SI Mahesh warns WhatsApp group admins.