July 12, 2026
Explore
మదనపల్లెలో రూ. 32 లక్షల గుట్కా పట్టివేత

మదనపల్లెలో రూ. 32 లక్షల గుట్కా పట్టివేత

July 12, 2026 | Andhra Pradesh

-యజమాని అరెస్ట్..

మదనపల్లె ముచ్చట్లు:

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ యం. వెంకటాద్రి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ కె. రాజారెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, రహీముల్లా వారి పోలీసు బృందం అప్పారావు వీధిలోని ఇమ్రాన్ ట్రేడర్స్‌పై దాడులు నిర్వహించారు.అక్రమంగా విక్రయిస్తున్న రూ. 32 లక్షల విలువైన 26,760 గుట్కా, ఖైనీ ప్యాకెట్లను సీజ్ చేసి, దుకాణ యజమాని ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు.యువతను, పిల్లలను మత్తుకు బానిసలను చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.అక్రమ విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100/112 కు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలపాలని ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి.

Tags: Gutkha worth Rs 32 lakh seized in Madanapalle