మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె రామారావు కాలనీలో ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఘర్షణపడి పరస్పరం దాడులు చేసుకొని కత్తులతో పొడుచుకున్నారు. గాంజా మత్తులో గొడవ పడ్డట్లు తెలుస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువకులు తనను కాలేజీలో పదే పదే చూసావన్న సాకుతో ఒకరు గొడవకు దిగగా మరొకరు చూసేదే ఏమౌతుంది నీ అంతు తెలుస్తానని మరొకరు గతంలో చిన్నచిన్న గొడవలు పెట్టుకుని పాత కక్షలు పెంచుకున్నారు. కాగా ఆదివారం ఇరు వర్గాలు రామారావు కాలనీలో ఒకచోటకు చేరి పరస్పరం గొడవలు చేసుకుని దాడులు దిగి ఒకరిపై మరొకరు కత్తులు పొడుచుకుని గాయపడ్డారు గాయపడ్డ వారిని స్థానికులు కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Tags: Two students clash with knives in Madanapalle.