July 12, 2026
Explore
14 న జిల్లా కేంద్రాల్లో FAPTO ఆధ్వర్యంలో ర్యాలీ

14 న జిల్లా కేంద్రాల్లో FAPTO ఆధ్వర్యంలో ర్యాలీ

July 12, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

14 నా జిల్లా కేంద్రాల్లో FAPTO ఆధ్వర్యంలో జరిగే ర్యాలీ మరియు పికిటింక్ కార్యక్రమం ను విజయవంతం చేయండి.. APCPS ఉద్యోగులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రేగంటి దేవానంద్.APCPS ఉద్యోగులు సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా విభాగం సమావేశం 12-7-26, ఆదివారం ఉదయం స్థానిక TPPM ఉన్నత పాఠశాలలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు రేగంటి దేవానంద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో దేవానంద్ మాట్లాడుతూ 14 వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రలలో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సమస్యలు PRC అమలు, CPS రద్దు, ఇన్ సర్వీసు టీచర్ లకు టెట్ రద్దు,I.R ప్రకటన, పెండింగ్ డి.ఏ విడుదల చేయాలని డిమాండ్ కోసం జరిగే ర్యాలీ మరియు పికిటింక్ ప్రతి CPS ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు, అలాగే 2003 ఉపాధ్యాయులు కు పాత పెన్షన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భం గా G.O వేంటనే విడుదల చేయాలని కోరారు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి హాజరు అయిన మహిళ ఉద్యోగులు తరుపున 14 నా జరిగే ర్యాలీ మరియు పికిటింక్ ను విజయవంతం చేయడానికి మీము అంత సిద్ధంగా ఉన్నామని CPS జిల్లా ఆర్థిక కార్యదర్శి టి.రెడ్డి రాణి తెలియజేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షులు S.విజయ లక్ష్మి, మెడికల్ డిపార్ట్మెంట్ తరుపున రోహిణి,జయ ప్రభ, తదితరులు పాల్గొన్నారు .

Tags:Rally under the auspices of FAPTO in district centers on the 14th