మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్ బాలాజీ నగర్ వద్ద ఆటో డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన విషాదకర ఘటనపై వివరాలు. బాలాజీ నగర్ లో కాపురం ఉంటున్న రెడ్డప్ప కొడుకు హరి 30 బాడుగ ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన తండ్రి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి గాయపడటంతో ఆసుపత్రిలో చేర్పించి సపరిళ్ళు చేస్తుండగా, ఆటోకు బాడుగ చెల్లించలేదని యజమానులు ఆటో ను రాత్రి ఎత్తుకెళ్లిపోయారు. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని హరి ఆత్మహత్య చేసుకున్నాడు.
Tags; Auto-rickshaw driver commits suicide by hanging after vehicle is seized.