పుంగనూరుముచ్చట్లు:
తెలుగుదేశం ప్రభుత్వంలో బలిజ కులస్తులకు తగిన గుర్తింపు ఇవ్వలేదని బలిజకులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక కృష్ణదేవరాయ సర్కిల్‌లో రాయల్‌పీపుల్‌ఫ్రంట్ నియోజకవర్గ కన్వీనర్ జనార్ధన్ రాయల్, ఆర్‌పిఎఫ్ నాయకుడు గోపిరాయల్ ఆధ్వర్యంలో బలిజయూత్ సమావేశం నిర్వహించారు. జనార్ధన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో తిరుపతి ఎమ్మెల్యే మాత్రమే బలిజకులానికి చెందిన వారని తెలిపారు. ఎంఎల్‌సీలు రాజ్యసభలో బలిజలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అలాగే కాపుకార్పోరేషన్ విషయంలో కూడ బలిజలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం అన్ని రంగాల్లోను బలిజలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో బలిజ సంఘ నాయకులు భాస్కర్‌రాయల్, హరిబాబు, ప్రహ్లాద, శివ, మల్లికార్జున , చక్రపాణిరాయల్, గణేష్‌రాయల్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Balijas lack recognition in the government.