July 12, 2026
Explore
హిందూవులచే ఛత్రపతి శివాజి శోభయాత్ర ర్యాలీ

హిందూవులచే ఛత్రపతి శివాజి శోభయాత్ర ర్యాలీ

July 12, 2026 | Andhra Pradesh

కాషాయం రెపరెపలాడింది

పుంగనూరుముచ్చట్లు:

మరాట అధినేత , ఛత్రపతి శివాజి జయంతి వేడుకలను ఆదివారం హిందూజాగరణ సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మేళతాళాలతో , విచిత్ర వేషధారణలతో , బాణసంచాల నడుమ శివాజి శోభయాత్ర ర్యాలీ జరిగింది. హిందూవులందరు ముక్తకంఠంతో ఛత్రపతి శివాజి మరాట టైగర్‌, హిందూవుల ఆశాజ్యోతి అంటు నినాదాలు చేశారు. ఛత్రపతి శివాజి చిత్రపటానికి అలంకారం చేసి, వాహనంపై ఊరేగించారు. పట్టణంలో కాషాయరంగు జెండాలు, తోరణాలు కట్టి పట్టణం కాషాయరంగులో మార్చివేశారు. దుర్గాదేవి, కాంతార వేషధారణలు పలువురిని ఆకట్టుకుంది. హిందూ మహిళలు అధిక సంఖ్యలో ఐకమత్యంతో కోలాటలు, నృత్యాలు, జానపద సంగీతాలు పాడుతూ ఊరేగింపులో పాల్గొనడం పలువురిని ఆకట్టుకుంది. ఊరేగింపులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సీఐ సుబ్బరాయుడు , ఎస్‌ఐలు అన్సర్‌బాషా, కెవి.రమణ , పోలీసులు కలసి భారీ బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించారు. ఈ కార్యక్రమంలో హిందూజాగరణ సమితి ప్రతినిధులు భక్తవత్సలరాజు, త్రిమూర్తిరెడ్డి, బాలసుబ్రమణ్యం, నానబాలమణి, రవిచంద్రరాజు, గౌరమ్మ, పరమేష్‌, వెంకటేష్‌, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ ఇలా….

శివాజి శోభయాత్ర ర్యాలీ పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో సాయంత్రం ప్రారంభమైంది. ర్యాలీలో హిందూవులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని పుంగమ్మ చెరువు కట్టపైన నుంచి నగిరివీధి, తేరువీధి, సెంటర్‌లాడ్జి, బజారువీధి, తూర్పువెహోగసాల నుంచి ఇందిరా సర్కిల్‌ నుంచి గోకుల్‌ సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Tags: Chhatrapati Shivaji Shobha Yatra rally organized by Hindus.