పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ వారిచే లియోక్లబ్‌ను ఆదివారం నూతనంగా ఏర్పాటు చేశారు. సంఘ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ సరళ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరావు ఆధ్వర్యంలో లియోక్లబ్ ఏర్పాటైంది. నూతన అధ్యక్షుడుగా మహమ్మద్‌రఫి, కార్యదర్శిగా ఉదయ్, కోశాధికారిగా రుహిళ తో పాటు 20 మంది సభ్యులను ఎన్నుకున్నారు. లియో క్లబ్ ముఖ్య ఉద్ధేశం విద్యార్థి దశ నుంచి సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, వాటి విధివిదానాలను అలవర్చుకోవడమేనని డాక్టర్ సరళ తెలిపారు.నూతన సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.



Tags; Establishment of Lions Leo Club