పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో ఆదివారం లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు డాక్టర్లు శివ, సరళ, క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరావు ఆధ్వర్యంలో చెన్నై శంకర్‌నేత్రాలయ వైద్యబృందం కంటి పరీక్షలు నిర్వహించారు. 60 మంది రోగులను పరీక్షించి , 13 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఆపరేషన్లు , కంటి అద్దాలు కూడ ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బాలసుబ్రమణ్యం, మహిపాల్‌రెడ్డి, ఇనాయతుల్లా షరీఫ్, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Overwhelming response to Lions eye camp