July 12, 2026
Explore
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములౌతాం

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములౌతాం

July 12, 2026 | Andhra Pradesh

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

తమ కుటుంభానికి అండగా ఉన్న ప్రజల కష్టసుఖల్లో తమ కుటుంబం భాగస్వాములౌతుందని వైఎస్సార్‌సిపి రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ , మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో వైఎస్సార్‌సిపి కాపు సంఘ నాయకుడు సికె.శ్రీనివాసులు కుమారై సాయిశిరీష , కిషోర్‌ల వివాహా రెసెప్షన్‌ కార్యక్రమానికి పెద్దిరెడ్డి హాజరైయ్యారు. వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామన్నారు. తమ కుటుంబంలో ముగ్గరిని గెలిపించిన ప్రజల సహకారం ఎన్నటికి మరచిపోలేమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పార్టీ నాయకులు కొండవీటి నరేష్‌, రాజేష్‌, కుమార్‌, హేమంత్‌, రాఘవ, రాజారెడ్డి, కిట్టా, ఆవుల హరిప్రసాద్‌, కిషోర్‌, మనోహర్‌ , ఖాదర్‌బాషా, అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; We will share in the joys and sorrows of the people.