July 12, 2026
Explore
రూ.63 లక్షల CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి

రూ.63 లక్షల CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి

July 12, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాయచోటి నియోజకవర్గ అబ్జర్వర్ అన్నా అనిత యాదవ్‌తో కలిసి 73 మంది అనారోగ్య బాధితులకు మొత్తం రూ.63 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి త్వరితగతిన సహాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Tags;Minister Mandipalli distributes CMRF cheques worth Rs 63 lakh.