July 12, 2026
Explore
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు ఎస్‌ఐ సుస్మిత హెచ్చరిక

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు ఎస్‌ఐ సుస్మిత హెచ్చరిక

July 12, 2026 | Andhra Pradesh

రెచ్చగొట్టే పోస్టులకు చెక్.. వీరబల్లి పోలీసుల హెచ్చరిక

వీరబల్లి ముచ్చట్లు:

వీరబల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు, వివాదాస్పద సందేశాలు ప్రచారం చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్‌లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీరబల్లి ఎస్‌ఐ సుస్మిత హెచ్చరించారు. కొందరు గ్రూపులుగా విడిపోయి ఇతరులను రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపులపై పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు. సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ స్పష్టం చేశారు.

Tags:SI Susmitha warns WhatsApp group admins.