మదనపల్లె మదనపల్లె
మదనపల్లెలో చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి. గిరిబాబు బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వచ్చిన ఆయనకు కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ గిరిబాబు మాట్లాడుతూ, అధ్యాపకులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేసి ప్రజాప్రతినిధులు, ప్రజలు, కళాశాల అభివృద్ధి కమిటీ సహకారంతో విద్యార్థుల ప్రవేశాలను పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
Tags: Giribabu assumes charge as Principal of Besant Theosophical Government Degree College.