July 12, 2026
Explore
పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

July 12, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజంపేట పట్టణంలోని మన్నూరు ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజంపేట పార్లమెంట్ జనసేన ఇన్‌చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పేరుతో అర్చనలు నిర్వహించి ఆయన ఆరోగ్య కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల పవన్ కల్యాణ్‌కు ఉన్న అంకితభావం ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags; Special prayers offered at Yellamma temple for Pawan Kalyan’s speedy recovery.