నందలూరు ముచ్చట్లు:
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి NTR నగర్‌కు చెందిన ఆంజనేయులు (45) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. SI మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అనంతరం భార్య బయటకు వెళ్లగా, ఆంజనేయులు ఈ ఘటనకు పాల్పడ్డాడు. తిరిగి వచ్చిన భార్య గమనించి పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో అంత్యక్రియల కోసం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, స్థానికులు ఆర్థిక సహాయం అందించారు.
Tags: Man commits suicide by hanging; financial aid for the family.