July 12, 2026
Explore
జాతీయ లోక్ అదాలత్‌లో 6,372 కేసులకు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో 6,372 కేసులకు పరిష్కారం

July 12, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేటలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 6,372 కేసులు పరిష్కారమయ్యాయని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజీ మార్గంలో కేసులను వేగంగా పరిష్కరించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి లావణ్య, జూనియర్ సివిల్ జడ్జి పి. రాజన్ ఉదయ్ ప్రకాష్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పి. వరప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. కృష్ణకుమార్, ఏపీపీ టి. రామకృష్ణ, ఏజీపీ ఛాయాదేవి, సీనియర్ న్యాయవాదులు, బెంచ్ సభ్యులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కేసుల పరిష్కారంలో సహకరించిన న్యాయవాదులు, సంబంధిత అధికారులను న్యాయమూర్తి అభినందించారు.

Tags: 6,372 cases resolved at National Lok Adalat