July 12, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ లో 13,128 కేసుల పరిష్కారం

అన్నమయ్య జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ లో 13,128 కేసుల పరిష్కారం

July 12, 2026 | Andhra Pradesh

పీలేరుముచ్చట్లు:

అన్నమయ్య జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 13,128 కేసులు పరిష్కారమయ్యాయి. రాయచోటి, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా పలు కేసులు రాజీమార్గంలో పరిష్కరించి బాధితులకు పరిహారం అందజేశారు. రాయచోటిలో అత్యధికంగా 9,649 కేసులు పరిష్కారమై రూ.1.14 కోట్లకు పైగా పరిహారం అందించగా, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె కోర్టుల్లోనూ గణనీయమైన కేసులు పరిష్కారమయ్యాయి. ఈ వివరాలను ఇన్‌చార్జ్ జడ్జి సుబహాన్ వెల్లడించారు.

Tags: 13,128 cases resolved at the National Lok Adalat in Annamayya district.