కలికిరి ముచ్చట్లు:
SIR గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం కూడా BLOలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు సచివాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని పీలేరు ఆర్డీవో ఎంవీఎస్ నారాయణ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల నమోదు, దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేసి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ వంద శాతం దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఉద్యోగులపై ఫిర్యాదులు రాకుండా బాధ్యతగా పనిచేయాలని, మంగళవారంలోపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Tags: Must be on duty even on Sunday: RDO Narayana Reddy