రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలం గడికోట బీట్ పరిధిలోని తడకోన అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది నిర్వహించిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన దుంగల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన హరిమూర్తి, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన సెట్టు అని గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.
Tags: Red sandalwood smugglers arrested in the Tadakona forest area.