July 11, 2026
Explore
వియత్నాం బోటు ప్రమాదంపై ఆరా తీసిన హోంమంత్రి

వియత్నాం బోటు ప్రమాదంపై ఆరా తీసిన హోంమంత్రి

July 11, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

వియత్నాం బోటు ప్రమాదంపై ఆరా తీసిన హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.

అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న మంత్రి అనిత.

వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతర సమన్వయం కొనసాగించాలని అధికారులకు ఆదేశం.

ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర భారతీయుల వివరాలు వెంటనే సేకరించాలని సూచన.

బాధితుల క్షేమంపై ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించాలని అధికారులకు ఆదేశం.

అవసరమైతే ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ.

బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.

కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం కొనసాగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ల పురోగతిని నిరంతరం తెలుసుకోవాలని మంత్రి అనిత సూచన.

ప్రమాదంలో చిక్కుకున్న వారంతా సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించిన మంత్రి అనిత.

Tags: Home Minister inquires about Vietnam boat accident.