July 11, 2026
Explore
జూలై 16న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

జూలై 16న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

July 11, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం అనంతరం ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.

ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని పవిత్ర జలంతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.

Tags: Koil Alwar Tirumanjanam at the Sri Kalyana Venkateswara Swamy Temple on July 16.