July 11, 2026
Explore
చిరుద్యోగులకు భద్రత కల్పించాలి

చిరుద్యోగులకు భద్రత కల్పించాలి

July 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులు , చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆటో, హమాలీ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సాంబశివ కోరారు. శనివారం ఆయన పట్టణంలో వివిధ అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. చిరుద్యోగులకు ఈపిఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి హక్కులు కల్పించాలన్నారు. నిత్యంశ్రమిస్తున్న కార్మికుల కోసం ప్రమాదభీమా , వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్య , గృహ సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈనెల 21న జనరల్‌బాడి సమావేశాన్ని పట్టణంలో నిర్వహించి, కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘనాయకులు వెంకట్రమణారెడ్డి, సురేష్‌కుమార్‌, రామమూర్తి, రెడ్డెప్ప, తిరుమలై, చలపతి, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Security must be provided to low-level employees.