July 11, 2026
Explore
12న ఛత్రపతిశివాజి శోభయాత్ర

12న ఛత్రపతిశివాజి శోభయాత్ర

July 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

హిందూసామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజి మహారాజ్‌ శోభయాత్ర ఆదివారం మధ్యాహ్నం నిర్వహించేందుకు హిందూజాగరణ సమితి ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం దుర్గాదేవి వేషధారణ బృందం ర్యాలీలో పాల్గొని హిందూవులను ఆకర్షించే కార్యక్రమ రిహార్షల్స్ చేపట్టారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైయ్యే ర్యాలీ సాయంత్రం దాక పట్టణ పురవీధులలో వైభవంగా నిర్వహించనున్నారు. సమితి ఆధ్వర్యంలో హిందూవులను ఐక్యం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు, ఆహ్వానపత్రాలు పంపిణీ చేయడంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలను సమితి అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి, ప్రతినిదులు పరమేష్‌, నానబాలమణి ,గంగాధర్‌, వెంకటేష్‌, హరి, మణి, మధు తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు. హిందూవులు అందరు ఐకమత్యంతో పాల్గొని, ముక్తకంఠంతో హిందూనినాదాన్ని చాటి చెప్పాలని కోరారు.

స్టేషన్‌లో సమావేశం….

సీఐ సుబ్బరాయుడు పోలీస్‌స్టేషన్‌లో శోభయాత్ర సందర్భంగా పీస్‌కమిటి సభ్యులు, హిందూ, ముస్లిం ప్రతినిదులతో సమావేశం నిర్వహించి , శివాజిశోభయాత్ర ర్యాలీ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: Chhatrapati Shivaji Shobha Yatra on the 12th