తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణలో 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను శుక్రవారం విడుదల చేసింది. గతంలో అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం.. వాటిని పరిశీలించి ఈ జాబితాను ప్రకటించారు. నియామకాల్లో పారదర్శకత కోసం, అభ్యర్థులు తమ అభ్యంతరాలను జులై 13 నుంచి జులై 15 సాయంత్రం 5 గంటల వరకు MHSRB వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. అభ్యంతరాలు ఒక్కసారి మాత్రమే స్వీకరించబడతాయని సూచించింది.
Tags; Merit list for Telangana ANM posts released.