బి కొత్తకోట ముచ్చట్లు:
బి కొత్తకోట మండలంలోని, ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సమీపంలోని కాండ్లమడుగు క్రాస్ వద్ద శుక్రవారం అర్థరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి గుర్తుతెలియని వ్యక్తి స్పాట్ డెడ్ అయ్యాడు. ఘటనపై బి కొత్తకోట పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 40 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. సమాచారం అందుకున్న బి కొత్తకోట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Unidentified person dies after being struck by an unknown vehicle at Kandlamadugu Cross.