July 10, 2026
Explore
పులిచెర్ల బీసీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పులిచెర్ల బీసీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

July 10, 2026 | Andhra Pradesh

పులిచెర్ల ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు), పులిచెర్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు తెలిపారు. ఇంగ్లీషు మీడియంలో 5వ తరగతిలో 22 సీట్లు, 6వ తరగతిలో 9 సీట్లు, 7వ తరగతిలో 8 సీట్లు, 8వ తరగతిలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.

ప్రవేశ పరీక్షను జూలై 15న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పులిచెర్ల బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్‌తో కలిసి జూలై 10 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలో దరఖాస్తు ఫారాలు పొందవచ్చని పేర్కొన్నారు.

పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 13లోపు పాఠశాలలో సమర్పించి వెంటనే హాల్‌టికెట్ పొందాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పులిచెర్ల ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ పాఠశాల ప్రధానాచార్యులను 8328079900 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Tags: Applications invited for admissions to Pulicherla BC Residential School.