March 24, 2026
Explore
పాము కాటుతో గీత కార్మికుడు మృతి

పాము కాటుతో గీత కార్మికుడు మృతి

March 24, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

👉సోమవారం ఉదయం కల్లు గీసి అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని తాటి పీచు తల కింద పెట్టుకోగా అందులో ఉన్న రక్త పెంజిరి పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ మృతి

ఆరుపదుల వయసు లో కల్లు గీత కార్మికుడు ఉదయాన్నే కల్లు గీత కోసం తాటి చెట్లెక్కారు అలసిపోయారు. విశ్రాంతి తీసుకుందామని తాటి పీచు తెచ్చుకొని పడుకున్నారు. అందులో పాము రూపంలో మృత్యువు దాగుందని తెలుసుకోలేకపోయారు. అది కాటేయడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈవిషాద ఘటన మండలంలోని చీర్లవారికండ్రిగలో జరిగింది. చిత్తలూరు గ్రామానికి చెందిన పర్చూరు కృష్ణయ్య (60) పొరుగునున్న చీర్లవారికండ్రికలో తాటి చెట్ల నుంచి కల్లు తీస్తుంటారు. శనివారం ఉదయాన్నే ఈపనికి వెళ్లి చెట్లెక్కి కల్లు తీశారు. అలసిపోవడంతో చెట్ల నీడన కూర్చునేందుకు దగ్గరలో తాటి పీచు తెచ్చుకొన్నారు. అందులో పాము ఉన్న విషయాన్ని గమనించలేదు. దానిమీద కూర్చొగానే అందులో ఉన్న రక్తపింజరి కాటేసింది. వెంటనే సమీపంలో ఉన్న భార్యకు విషయాన్ని తెలిపారు. స్థానికుల సాయంతో పొదలకూరు సీహెచ్సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహంపై పడి అతని భార్య విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:Toddy Tapper Dies of Snakebite