గన్నవరం ముచ్చట్లు:
గన్నవరం కోర్టులో రావణ్ తరఫున వైకాపా లీగల్ సెల్ హాజరు
సోషల్ మీడియా కామెంట్ల కేసులో అరెస్టు అయిన రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణను గన్నవరం కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
రావణ్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం గన్నవరం కోర్టులో విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా రావణ్ తరఫున వైకాపా లీగల్ సెల్ ప్రతినిధులు పొన్నవోలు సుధాకర్, ఓ.గవాస్కర్, తిరువీధి వెంకయ్య కోర్టుకు హాజరయ్యారు.
అయితే ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయాధికారి పిటిషన్ విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు.
Tags: Hearing on Ravan’s custody petition adjourned to the 14th of this month.