రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలోని మోనార్కు వీధి ఉమర్ మసీదు సమీపంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారిన వెళ్లే ద్విచక్ర వాహనదారులను, పాఠశాలలకు వెళ్లే చిన్నారులను కుక్కలు తరుముకుంటూ భయాందోళనకు గురిచేస్తున్నాయని చెబుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Tags: Stray dog menace in Rayachoti; public concerned.