పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఎఫ్‌ఏపిటివో సంఘం ప్రకటించింది. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల ఐక్యతే మా బలం…హక్కుల సాధనే మాలక్ష్యం అంటు పోస్టర్లు విడుదల చేశారు. 12వ పీఆర్‌సిని ప్రకటించాలని , సీపిఎస్ రద్దు చేసి, ఓపిఎస్ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డిఏలను విడుదల చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్ బకాయిలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయులు ఛలో కలెక్టరేట్‌తో పాటు పికెటింగ్‌లు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: Turn out for the protest by teachers on the 14th.