పుంగనూరుముచ్చట్లు:
అఖిలభారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్, స్వామి వివేకానంద, తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండా ఎగురవేశారు. విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ ఏబివిపి అని కొనియాడారు. విద్యార్థుల ఐక్యత, సమస్యలపై పోరాటమే ఏబివిపి లక్ష్యం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు విజయశంకర్, విజయభాస్కర్‌రెడ్డి, జగదీష్‌రాజు, ఈశ్వరమ్మ, రెడ్డిసాగర్ , మహేష్, త్రిశూల్, మధు, సందీప్, గణేష్, సత్య తదితరులు పాల్గొన్నారు.
Tags: ABVP Foundation Day Celebrations