July 9, 2026
Explore
నాగదేవతల ప్రతిష్ఠాపన

నాగదేవతల ప్రతిష్ఠాపన

July 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని తూర్పువెహోగసాలలో గల శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలో నాగదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని జెట్టి కులస్తులు వైభవంగా భక్తిశ్రద్దలతో నిర్వహించారు. గురువారం ఉదయం గణపతి పూజతో ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితులు ప్రారంభించారు. మహాపూర్ణాహుతి నిర్వహించి, శ్రీవల్లీదేవసమేత సుబ్రమణ్యస్వామికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.నాగదేవతలకు పాలుపోసి , మొక్కులు చెల్లించుకున్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

Tags: Consecration of Naga Deities