July 9, 2026
Explore
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా  సుకుమార్ బాబు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సుకుమార్ బాబు.

July 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కనమ కుంట సుకుమార్ బాబును నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఉత్తరువు పత్రాలను అందించారు. అన్నమయ్య జిల్లా, పుంగనూరు, పట్టణానికి చెందిన విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు బీసీల పక్షాన నిలబడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తించిన రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నియమించినట్లు షణ్ముగం తెలిపారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు , విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను
రాష్ట్ర ఉపాధ్యక్షులుగానియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణయ్యకు, జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమకు ఈ పదవులు రావడానికి సహకరించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హేమావతి అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి గౌని రెడ్డప్ప, సుబ్రహ్మణ్యం కు మా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీసీ కులాల బలోపేతానికి బీసీలకు ఏ సమస్య వచ్చిన ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని బీసీల రిజర్వేషన్ ఆధారంగా బీసీల కోసం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం నేతృత్వంలో అవసరమైన ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని విస్తరించి బీసీ లందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్నమయ్య జిల్లాలో కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా సుకుమార్ బాబు తెలిపారు.

Tags: Sukumar Babu appointed as State Vice-President of the National BC Welfare Association.