ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీలో పిడిఎస్ రైస్ మాఫియా అధికారులను శాసించే స్థాయి కి వెళ్ళారంటే అవినీతి ఏ రకంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు
పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం గమ్యం మాత్రం పేదలకు చేరడం లేదు, బ్లాక్ మార్కెట్ గోదాంలకు వెళుతుంది!
విపరీతంగా జరుగుతున్న రైస్ మాఫియాకు ఇబ్రహీంపట్నం స్టేషన్ కు కొత్తగా వచ్చిన అధికారి కళ్లెం వేస్తారంటూ ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ప్రభుత్వ రేషన్ బియ్యం మాఫియా ఒక పెద్ద దందాగా మారింది. పిడిఎస్ బియ్యం లారీలు గమ్యం చేరక ముందే మలుపు తిప్పబడి, రైస్ మిల్లులు, బల్క్ కొనుగోలుదారుల వద్ద చేరుతోంది. పేదలకు రావలసిన అన్నం, మాఫియాకు బంగారం అవుతోంది.
అధికారుల వైఫల్యం..?
గ్రామ, పట్టణ స్థాయిలో రేషన్ షాప్‌ల పరిశీలనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణలో విఫలమవ్వడంతో మాఫియా మరింత రెచ్చిపోతోంది. అనధికార లారీలు, మూసి ఉన్న బియ్యం గోదాంలు – ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కానీ చర్య మాత్రం గాలిలో కలిసిపోతోంది.
ఎవరికి భయపడని మాఫియా
ఎవరికి ఇవ్వాల్సిన ముడుపులు వారికి పడేస్తున్నాం నన్ను ఆపేది ఎవడు అని బాహాటంగా సవాల్ విసురుతున్న ఇబ్రహీంపట్నం రేషన్ మాఫియా..
పత్రికా విలేఖరులు, ప్రజలు ఫిర్యాదులు వచ్చినా కూడా రైస్ మాఫియాకు ఏమాత్రం భయం లేదు. కొన్ని చోట్ల ఈ దందాలో స్థానిక రాజకీయ నాయకుల వరకు ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అధికారులు కూడా ఏమి చెయ్యలేని స్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం – మాఫియాకు వరం
ప్రతి నెలా కోట్ల రూపాయల సబ్సిడీతో పేదల బియ్యం అందిస్తున్న ప్రభుత్వం – కానీ ఆ బియ్యం మాఫియాకు వరప్రసాదంలా మారింది. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లాభాలకోసం వాడుకుంటున్నారు.
❓ఎందుకు అధికారులు మాఫియాపై గట్టి చర్యలు తీసుకోవడం లేదు..?
❓ఎందుకు రైస్ మిల్లులపై సీరియస్ రైడ్స్ జరగడం లేదు..?
❓ఎందుకు రేషన్ షాప్‌ల నుండి గల్లంతైన బియ్యం ట్రాకింగ్ జరగడం లేదు..?
ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పేదల నోరుకి రాకముందే మాఫియాల జేబుకి వెళ్ళిపోవడం సిగ్గుచేటు. నిఘా వ్యవస్థ పటిష్టం చేయకపోతే, రైస్ మాఫియాను ఎదుర్కోకపోతే, పేదల హక్కు కాపాడలేం. అధికారులు మేల్కొనాలి, ప్రజల నిధులను దోచుకుంటున్న రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి.
అధికారులు రేషన్ మాఫియాతో సంబంధం ఉన్న వారిని,గతంలో రేషన్ దందా నిర్వహిస్తున్నవారిని స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాము అని చెప్పినప్పటికీ వారు రేషన్ దందా నిర్వహించడం విస్మయానికి గురిచేస్తుంది…
మాఫియాకు దాడులు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది సిబ్బంది దాడుల విషయాన్ని ముందుగానే మాఫియాకు చేరవేస్తూ వారిదగ్గర ముడుపులు తీసుకోవడంతో వారికి మరింత బలం చేకూరుతుందనే వాదన గట్టిగా వినిపిస్తుంది….
మాఫియా డైరెక్ట్ గా రేషన్ దుకానాల యజమానులకు డబ్బు ఆశ చూపడంతో అక్కడే సగం వ్యాపారం జరిగిపోతుంది,లేదంటే ప్రజల ఇండ్ల వద్దకు మాఫియా సభ్యులు వెళ్లి మరికొంత ఎక్కువ చెల్లించి బైక్లు,స్కూటీ ల మీద గమ్యానికి చేరుస్తున్నారు…
ఏది ఏమైనా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలంటే మాఫియాఫై ఉక్కుపాదం మోపాల్సిందే నంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు….
కొండపల్లిని శాశించే ఒక పిడిఎస్ డాన్ బహిరంగా పోలీస్,రెవిన్యూ, టాస్క్ ఫోర్స్, విజలెన్స్ ఇలా అన్ని శాఖలేలోనూ మా వాళ్లే ఉన్నారు.మనల్ని ఎవరు ఆపేది అని అనడం ప్రజలని విస్మయానికి గురించేస్తుంది…
కొండపల్లి రేషన్ డాన్ ప్రత్యేక కధనం త్వరలో….
Tags: The Ration Mafia Runs Rampant and Unchecked in Kondapalli Municipality.